Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics Telugu మేలు చేయక నీవు ఉండలేవయ్యా

melu cheyaka neevu undalevayya song lyrics in telugu

మేలు చేయక నీవు ఉండలేవయ్యా 
    ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) 
    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| 



1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా 
    నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) 
    నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) 
    క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| 



2. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను 
    పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) 
    నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) 
    నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| 


3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను 
    క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) 
    నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) 
    అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||

Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics Telugu మేలు చేయక నీవు ఉండలేవయ్యా