మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు
మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2)
మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు
యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2)
మేడి చెట్టు కింద ఎవ్వరాగారు
చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2)
మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు
యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2)
ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)
యేసుని నీవు చేర్చుకుంటావా
నీ హృదయములో స్థానమిస్తావా (2)
ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)