మట్టినైన నన్ను మనిషిగా మార్చి
జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2)
ఎంత పాడినా – ఎంత పొగిడినా
ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా
నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
నా యేసురాజా నా దైవమా (2)
నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే
నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2)
నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2)
అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత పాడినా||
అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే
కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే (2)
నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం (2)
విశ్వ మానవాళికి పాపవిమోచన (2) ||ఎంత పాడినా||