మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని||
కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)
పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని||
నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది
తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2)
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము
నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని||