మరువగలనా మరలా Telugu Christian Songs Lyrics

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను

ఆశయు అక్కరయు పాపమై
చిక్కితి శత్రువు చేతులలో
మరణపు టంచున చేరితిని
ఇంతలోనే యేసు కరుణింప వచ్చి
క్షమియించి విడిపించెను
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను

ఏ పాపికి కడు భాగ్యమే
యేసుని చేరగ ధన్యమే
యేసుని ప్రేమ అనంతమే
నీ పాపమంతా తొలగించి
యేసు ప్రేమించి దీవించును
నీ భారమంతయు భరియించును
కన్నీరు తుడిచి ఓదార్చును
శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఆ సిల్వ ప్రేమను చూపెదను
నా క్రీస్తు వార్తను చాటెదను
జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

మరువగలనా మరలా Jesus Songs Lyrics in Telugu


మరువగలనా మరలా Telugu Christian Songs Lyrics