మల్లెలమ్మా మల్లెలు Telugu Christian Songs Lyrics

మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2)
ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2)

నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2)
జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2)
నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2)
లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2)
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2)
రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2)
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

మల్లెలమ్మా మల్లెలు Jesus Songs Lyrics in Telugu