Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

మహోన్నతుడా మా దేవా Telugu Christian Songs Lyrics

మహోన్నతుడా మా దేవా
సహాయకుడా యెహోవా (2)
ఉదయ కాలపు నైవేద్యము
హృదయపూర్వక అర్పణము (2)
మా స్తుతి నీకేనయ్యా
ఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా||

అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు (2)
అసమానమైన తేజో మహిమ
కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||

జలముల ధ్వని వంటి కంట స్వరం
నోటను రెండంచుల ఖడ్గం (2)
ఏడు నక్షత్రముల ఏడాత్మలను
కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||

ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా (2)
పాతాళ లోకపు తాళపు చెవులు
కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||

మహోన్నతుడా మా దేవా Jesus Songs Lyrics in Telugu


మహోన్నతుడా మా దేవా Telugu Christian Songs Lyrics