మధురం ఈ శుభ సమయం
అతి మధురం వివాహ బంధం (2)
ఆనందమే ఇరువురి హృదయం (2)
జత కలిసె ఈ తరుణంలో (2)
నవ దంపతులకు స్వాగతం ||మధురం||
ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2)
మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా (2)
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం||
ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
మనసులో వెలియగ మమతలు విరబూయగా (2)
అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2)
మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి ||మధురం||