మాట్లాడే యేసయ్యా
నాతో మాట్లాడుచున్నాడు (2)
(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే||
వెన్నలాంటి కన్నులలో
కురిసే తన ప్రేమను పంచాలని (3)
వేకువనే తట్టుచున్నాడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే||
అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే||
లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరిపించాడు మహనీయుడు (3)
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
తన మాటతో నన్ను బలపరచాడు
కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే||