మాకు తోడుగ నీవుంటివి
జీవిత యాత్రలో (2)
మమ్ము విడువని మా దేవా
నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు||
మాతో కూడా ఉందునంటివి
మారని మా దేవా (2)
పరము చేరు వరకు దేవా
మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని||
శత్రువు మాపై చెలరేగగా
కృంగదీయ జూడగా (2)
యెహోవా నిస్సిగా మాకుండి
విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని||
కష్టములెన్నెన్నో ఎదురైనా
నిన్నే వెంబడింతుము (2)
మాకు తోడుగా నీవుండగా
మేము భయపడము (2) ||మమ్ము విడువని||