maa oohalu puttaka munupe

మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవ

ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా

విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో

పొందెదమెన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో

1. నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి

నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా

పలు సమయాల యందు – పలు వరముల నిచ్చితివే

అడుగనేల ప్రభువా – ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు

2. ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చుమని

నిన్నడిగుచున్నాము – నీ రాజ్యములొ చోటిమ్మని

ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవ

ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడె చాలు