లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||