Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

లే నిలబడు Telugu Christian Songs Lyrics

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు ||లే నిలబడు||

రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం ||లే నిలబడు||

సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం ||లే నిలబడు||

లే నిలబడు Jesus Songs Lyrics in Telugu


లే నిలబడు Telugu Christian Songs Lyrics