kuthuhalamaarbatame

కుతూహల మార్భాటమే – నా యేసుని సన్నిధిలో

ఆనంద మానందమే – నా యేసుని సన్నిధిలో
…కుతూహల…

1.
పాపమంత పోయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో

క్రీస్తునందు జీవితం – కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో (2X)
…కుతూహల…

2.
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే

ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే (2X)
…కుతూహల…

3.
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును

ఏకముగా కూడి, హోసన్న పాడి – ఊరంత చాటెదము (2X)
…కుతూహల…

4.
భూరధ్వనితో పరిశుద్ధులతో – యేసు రానైయుండె

ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది – మహిమలో ప్రవేశిద్దాం (2X)
…కుతూహల…