Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

క్షణమైన గడవదు Telugu Christian Songs Lyrics

క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా – (2)
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా – (2)
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన||

ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే||

పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2) ||నీవే||

జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2) ||నీవే||

క్షణమైన గడవదు Jesus Songs Lyrics in Telugu


క్షణమైన గడవదు Telugu Christian Songs Lyrics