Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కృపగల దేవా Telugu Christian Songs Lyrics

కృపగల దేవా దయగల రాజా

కృపగల దేవా దయగల రాజా
చేరితి నిన్నే బహు ఘనతేగా
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని (2)
సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల||

త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారథి నీవే (2)
జీవన యాత్రా శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్థన పరిమళమాయె
నీ ఉదయకాంతిలో నను నడుపుము
నా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల||

కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్ధానములు నెరవేర్చినావే (2)
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును
నీ దివ్య మహిమలను ప్రకటింతును (2) ||కృపగల||

నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగి వచ్చు వేళ (2)
ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవింతు నీలోనే యుగయుగములు (2) ||కృపగల||

కృపగల దేవా Jesus Songs Lyrics in Telugu


కృపగల దేవా Telugu Christian Songs Lyrics