కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||
2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపా||
3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా||
4. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపా||