Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

krupa vembadi krupa pondithini

కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
యేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయా
క్షమవెంబడి క్షమ పొందితిని నీ క్షమలో కొనసాగితిని
మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
కృపా సత్య సంపూర్ణుడా – క్షమా ప్రేమ పరిపూర్ణుడా

1. పాపములో పరి తాపమును – పరితాపములో పరివర్తనను
పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
ప్రశవించెను పరిశుద్దాత్ముడు – ప్రశరించెను శిలువ శిక్షణలో

2. ఆత్మలో దీనత్వమును – దీనత్వములో సాత్వీకతను
సాత్వీకతలో మానవత్వమును – మానవత్వములో దైవత్వమును

ప్రసవించెను పరిశుద్దాత్ముడు – ప్రసరించెను దైవ రక్షణలో