క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..
పశులపాక పావనమై.. పరవశించెనుగా…
పరవశించెనుగా…
క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
పశులపాక పావనమై పరవశించెనుగా
గొర్రెల కాపరులు సంతోషముతో
గంతులు వేసెను ఆనందముతో (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు||
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను
చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)
పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే
ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున||
సంతోషము సమాధానము కృపా కనికరము
మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2)
సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి
బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2) ||తూర్పు దిక్కున||