క్రైస్తవ జీవితం Telugu Christian Songs Lyrics

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ||

ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ||

నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు (2)
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ||

బూర శబ్దంబు మ్రోగెడి వేళ
శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2)
ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2) ||క్రైస్తవ||

క్రైస్తవ జీవితం Jesus Songs Lyrics in Telugu


క్రైస్తవ జీవితం Telugu Christian Songs Lyrics