కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల||
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) ||కోటి కాంతుల||
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2) ||కోటి కాంతుల||