Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కొండలతో చెప్పుము Telugu Christian Songs Lyrics

కొండలతో చెప్పుము కదిలిపోవాలని
బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2)
నమ్ముట నీ వలనైతే
సమస్తం సాధ్యమే – (3)
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
మనసులో సందేహించక మాట్లాడు
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో||

యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే
యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే
గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి
దోనెలోనికొచ్చెను జలములు జోరున
శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే
ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా
మేము నశించిపోతున్నామని
ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి
రక్షకుడు పైకి లేచాడు –శిష్యులకు చేసి చూపాడు
పరిస్థితుత్లతో మాటలాడాడు
ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు
శిష్యులను తేరి చూచాడు –విశ్వాసం ఎక్కడన్నాడు
అధికారం వాడమన్నాడు
ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి
ప్రభునే స్తుతిద్దాము – జై
జై జై జై జై జై జై జై జై
ఈశు మసీహ్ కి జై
ఈశు కే జై జై జై
ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||

పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే
పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే
కన్నులెత్తి చూడు – తెల్లబారె పైరు
కోతకొచ్చి నిలిచెను మనకై నేడు
వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే
కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు
క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను
ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం –సాతాను క్రియలు బందిద్దాం
విశ్వాస వాక్కు పలికేద్దాం
ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం
పరలోక రాజ్య ప్రతినిధులం –తాళాలు ఇంకా తెరిచేద్దాం
ఆత్మలను లోనికి నడిపిద్దాం
ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా
ఈశు మసీహ్ కి జై – జై
జై జై జై జై జై జై జై జై
ఈశు మసీహ్ కి జై
ఈశు కే జై జై జై
ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||

కొండలతో చెప్పుము Jesus Songs Lyrics in Telugu


కొండలతో చెప్పుము Telugu Christian Songs Lyrics