Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

kalvari giri pai

కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

1. తుంటరులంత పట్టి కట్టి తిట్టుచు నిన్ను
కొట్టిర తండ్రీ తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

2. మూడు దినముల్ సమాధిలో ముదముతోడ
నిద్రించితివా ముదముతోడ నిద్రించితివా
నా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి

3. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘముపైకి
పంపించితివా ఆదరణాత్మన్ పంపించితివా
నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను