Jeevamu unna naa yesayya song lyrics
జీవము ఉన్న నా యేసయ్యా
నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా
జీవము లేని వాటికి ఎందరో మ్రొక్కుచు
జీవమున్నదని వారు భ్రమ పడుచున్నారు
మనుషులు చేసిన ప్రతిమాలన్నీ
ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా
మనుషులను చేసినది నీవే యేసయ్యా
ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యూ
జగతికి పునాది వేయకముందే
క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు
ఇంత విలువ ఉన్నదని నాకు తెలియదే
నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను
ఈపామరుడే పాటలుపాడగా
దూతలతో నీవు సంతోషిస్తావు
నాలో ఊపిరి ఉన్నంతకాలము యేసయ్యా
నిన్ను గూర్చి పాడకుండ ఉండలేనయ్యా
Listen Jeevamu vunna naa yesayya ninnu song below.