jayasheeluda ma yesayya lyrics song in telugu
జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా
జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం
ఆ. . ఆ. . ఆ. . ఆ. . హల్లెలుయా (2) ఆ. . హల్లెలూయా
1. బలమిచ్చు వాడా బలవంతుడాశక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా
తృప్తినిచ్చు వాడా తనయులకు ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా
మాకై మరల రానుంటివా యేసు (2)
2. ఆదియు అంతము నీవేగా ఆరాద్యుండవు నీవేగా
అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా
అనిశం నిన్నే కీర్తింతును యేసు (2)
3. నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని
నీవే మాకు తండ్రివి నీకు సమస్తము సాద్యమే
నీపై సర్వం మోపితిని యేసు (2)