జయహే జయహే క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే రారాజు ప్రభువుకే జయహే
నరులను చేసిన దేవునికి జయహే జయహే
మరణము గెలిచిన వీరునికి జయహే జయహే
త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే
ఆత్మనాదునికి జయహే మన అన్న యేసునకు జయహే జయహే
1. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయహే
తన రూపుతో మానవులను సృజించిన ప్రభువునకు జయహే
ఆది అంతముకు జయహే అద్వితీయునకు జయహే
అత్యున్నతునకు జయహే అనాది దేవునికి జయహే
2. దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు జయహే
పరిశుద్దుడు పరిశుద్దుడని దూతలు పొగడే ప్రభువుకు జయహే
అగ్ని నేత్రునకు జయహే ఆత్మ రూపునకు జయహే
అమరత్వునకు జయహే అనంతదేవునకు జయహే
3. తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు జయహే
తన బలముతో మరణంబును జయించిన వీరునకు జయహే
సిల్వదారునకు జయహే త్యాగసీలునకు జయహే
మరణ విజయునకు జయహే జీవించు దేవునకు జయహే
4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు జయహే
తనుండేడి స్థలమందున మనలను ఉంచెడిప్రభువుకు జయహే
న్యాయ తీర్పరికి జయహే సర్వశక్తునకు జయహే
సర్వోన్నతునకు జయహే సైన్యముల అధిపతికి జయహే