హృదయపూర్వక ఆరాధన
మహిమ రాజుకే సమర్పణ (2)
నిత్యనివాసి సత్యస్వరూపి
నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ||
నా మనసు కదిలించింది నీ ప్రేమ
నా మదిలో నివసించింది నీ కరుణ
ఎంతో ఉన్నతమైన దేవా (2)
క్షేమాధారము రక్షణ మార్గము
మాకు సహాయము నీవేగా (2) ||హృదయ||
ఆత్మతో సత్యముతో ఆరాధన
నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన
నీకై పాడెదను యేసయ్యా (2)
కృపామయుడా కరుణ సంపన్నుడా
నిత్యము నిన్నే పూజింతును (2) ||హృదయ||