Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

హీనమైన బ్రతుకు నాది Telugu Christian Songs Lyrics

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన||

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన||

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన||

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||

హీనమైన బ్రతుకు నాది Jesus Songs Lyrics in Telugu


హీనమైన బ్రతుకు నాది Telugu Christian Songs Lyrics