Listen andamaina lokam lyrics on cmportal.in
Lyrics
ఎంతో అందమైన ఈ లోకములోన
అన్నీ కూడా మాయా స్వరూపములే
ఒక్క రోజున అంతము వచ్చుగా
అన్నిటిని లయము చేసి పోవుగా
చూడబోతే ఎంతో సుందరమైనది
అందుకొన పోతే అది అందనిది
లోకము పై ఆశ పడితే మోసమేగా
మోస పోతే నీకు నిత్య నరకమేగా
లోకము నైనను లోకంలో ఉన్నవైనను
ప్రేమించొద్దని బైబిల్ బోధించెను
లోకము పై ఆశ పడితే మోసమేగా
మోస పోతే నీకు నిత్యం నరకమేగా
యేసు క్రీస్తు నందు ఉన్నవారికి
ఏ శిక్ష విథియు లేనేలేదుగా
యేసుక్రీస్తును విశ్వసిస్తే చాలుగా
నిత్య జీవము పరలోక రాజ్యము