Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి Telugu Christian Songs Lyrics

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోతివా చింతతో సమాధికి
వాదమాడి.. పంతమాడి (2)
అంతలోనే కన్ను మూసి పోతివా (2)

ధనము ధాన్యము కూడబెట్టి
మేడ మిద్దెలు కట్టబెట్టి (2)
అంత విడచి ఒంటిగానే పోతివా
ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2) ||ఎంత||

కొండలాంటి అండ బలమును
చూచి ఎంతో అదిరి పడితిని(2)
కండ బలము కరిగిపోయే
నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2) ||ఎంత||

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి Jesus Songs Lyrics in Telugu