పల్లవి: ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై – వేచి యుంటిని – నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా – నా ప్రార్ధన ఆలకించుమా
1. నీ తోడు లేక – నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
నీ తోడు లేక – నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
అడవి పూవులే – నీ ప్రేమ పొందగా – అడవి పూవులే – నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా – ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
2. నా ఇంటి దీపం – నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి
నా ఇంటి దీపం – నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము – ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో – ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
3. ఆపదలు నన్ను – వెన్నంటియున్న – నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు నన్ను – వెన్నంటియున్న – నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా – లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు – ప్రభువా నీ నుండి వేరు చేయవు
ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే