ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య
నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా
నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలిక లోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
నా మనవులు ముందె
నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య
హల్లెలూయ యేసయ్య