ఎనలేని ప్రేమ నాపైన చూపి Telugu Christian Songs Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా (2)

నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని||

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||

ఎనలేని ప్రేమ నాపైన చూపి Jesus Songs Lyrics in Telugu


ఎనలేని ప్రేమ నాపైన చూపి Telugu Christian Songs Lyrics