Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఈ తరం యువతరం Telugu Christian Songs Lyrics

ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం||

సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

ఈ తరం యువతరం Jesus Songs Lyrics in Telugu


ఈ తరం యువతరం Telugu Christian Songs Lyrics