Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఈ సాయంకాలమున Telugu Christian Songs Lyrics

ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున||

చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున||

దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున||

నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున||

జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||

ఈ సాయంకాలమున Jesus Songs Lyrics in Telugu


ఈ సాయంకాలమున Telugu Christian Songs Lyrics