Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Digulu Padaku Sevaka

దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా
నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచె గదా
కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగా
నీతోనే నడచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగా
ఓ సేవకా భయపడకిక జయము నీదె గదా

అగ్నివంటి శోధనలకు భయపడకుమయా
అగ్నిలోను క్రీస్తు అండ తోడుండగా
అగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘనపరచునుగా
షద్రకు మేషకబెద్నెగోలను మరచిపోకుమా
ఓ సేవకా భయపడకికా అగ్ని మేలెగదా

ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమా
నీకున్న అవసరతలు తండ్రికి తెలియునుగా
ఆకాశము నుండి మన్నాను పంపి పోషించె గదా
ఐదు రొట్టెలు రెండు చేపలు సంగతి మరువకుమా
ఓ సేవకా భయపడకిక గంపలు మిగిలెగదా

నీవు కలిగిన దర్శనమును విడిచిపెట్టకుమా
లోకాశలకు ధన సంపదకు లొంగిపోకుమా
స్త్రీ వ్యామోహం ఈ లోక స్నేహం నీకు తగదు గదా
ఆత్మల రక్షణ సంఘ పోషణ నీపై నుండె గదా
ఓ సేవకా వెనుదిరుగక ముందుకు సాగుమయా