Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

devuniki stothramu gaanamu

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్న వాడనీ
ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని

2. గుండె చెదరిన వారిని బాగుచేయు వాడనీ
వారి గాయము లన్నియు కట్టుచున్న వాడని

3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని

4. ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని

5. దీనులకు అండాయనే భక్తి హీనుల కూల్చును
సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడి

6. ఆయన ఆకాశము మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము సిద్ధ పరచు వాడని

7. పర్వతములో గడ్డిని పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును

8. యెరుషలేము యెహోవను సీయోనూ నీ దేవునీ
కీర్తించుము కొని యాడుము ఆనందించు వాడని