Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

దేవుని సముఖ జీవ కవిలెలో Telugu Christian Songs Lyrics

దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

దేవుని సముఖ జీవ కవిలెలో Jesus Songs Lyrics in Telugu


దేవుని సముఖ జీవ కవిలెలో Telugu Christian Songs Lyrics