Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

devuni prema idigo

దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును

1. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను
సర్పోకారుడుండే మనమీద జాలిపరుడై యుండెను

2. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే

3. యేసుక్రీస్తను పేరున రక్షకుండు వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో నెంతో సుభాషలను బల్కినాడు

4. పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను

5. సతులైన పురుషులైనన్‌ యాకర్త సర్వజనుల యెడలను
సత్ప్రేమగ నడిచెను పరలోక సద్బోధలిక జేసెను

6. చావు నొందిన కొందరిన్‌ యేసుండు చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు ప్రభునిం స్వస్థంబు తామొందిరి

7. గాలి సంద్రపు పొంగులన్‌ సద్దణపి నీళ్లపై నడచినాడే
మేలుగల యద్భుతములు ఈలాగు వేలకొలదిగ జేసెను

8. చేతుల కాళ్లలోను రారాజు చేరమేకులు బొందెను
పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేక

9. ఒడలు రక్తము గార దెబ్బదలు చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తలమీదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు

10. ఇన్నిబాధలు బెట్టుచు దనుజంపు చున్న పాపనరులను
మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను

11. రక్షకుడు శ్రమ బొందగా దేశంబు తక్షణము చీకటయ్యెన్‌
రక్షకుడు మృతినొందగ తెర చినిగి రాతి కొండలు పగిలెను

12. రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును
పాతిపెట్టిరి భక్తులు నమ్మిన నాధులందరు జూడగా

13. మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్‌

14. పదునొకండు మారులు వారలకు బ్రత్యకక్షుడాయె నేసు
పరలోకమున కేగెను తన వార్త బ్రకించుమని పల్కెను

15. నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును
నమ్మనొల్లక పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను