Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

దేవుడు నీకు తెలుసు Telugu Christian Songs Lyrics

దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
అవసరాలకు దేవుని నమ్మక
ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు||

నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు||

నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||

దేవుడు నీకు తెలుసు Jesus Songs Lyrics in Telugu


దేవుడు నీకు తెలుసు Telugu Christian Songs Lyrics