Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Deva Samsthuthi Cheyave Manasa Telugu Christian Song

Deva samsthuthi cheyave manasa telugu christian song lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||

జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||

చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||

యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||

ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ||

అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||

పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ||

పడమటికి తూర్పెన్తా ఎడమో – పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ||

కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ||

మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ||

పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ||

పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||


https://www.youtube.com/watch?v=y0qtc_SD5oM

Source from: https://www.youtube.com/watch?v=y0qtc_SD5oM