చిన్ని చిన్ని చేతులతో
బుల్లి బుల్లి బుగ్గలతో
బెత్లెహేము పురము నుండి
కన్య మరియకి పుట్టెనండి
యేసు క్రీస్తు నామమండి
రక్షకుడని అర్ధమండి
పరలోకమున దూతలందరు
సర్వ సైన్యములతో కూడను
పాటలతో పరవశిస్తూ
మహిమ కరుడంటూ పొగుడుతూ
భువికేగె నేకముగా బూరధ్వనితో
రక్షకుని సువార్త చాటింపగా
ఆకసమున తారలన్ని
నేముందు నేముందని త్వర త్వరపడగా
తూర్పు నందొక చిన్ని తార
పరు పరుగున గెంతుకొచ్చి
భువికి సూచన ఇవ్వనండి
బెత్లెముకి మార్గము చూపనండి
దూత వార్త గొన్న గొల్లలు
గెంతులేస్తూ చూడ వచ్చిరి
పసుల తొట్టిలో ప్రభుని చూచి
పట్టలేని సంతసముతో
స్తుతుల గానము చేసెరండి
సకల జనులకు చాటెరండి
తారన్ చూచి జ్ఞానులు కొందరు
రారాజును చూడ బయలు దేరి
బంగారమును బోళమును
సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె
పూజించ వచ్చిరి ప్రభు యేసుని
రాజులకు రాజని ఎరిగి వారు
ఎంత సందడి ఎంత సందడి
దీవిలోన భువిలోన ఎంత సందడి
యేసు రాజు జన్మ దినము
ఎంత భాగ్యము ఎంతో శుభము
దేవ దేవుని అమర ప్రేమండి
దివ్య వాక్కు ఫలితమండి