భారత దేశ సువార్త సంఘమా Telugu Christian Songs Lyrics

భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా
ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత||

ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా
కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

భారత దేశ సువార్త సంఘమా Jesus Songs Lyrics in Telugu


భారత దేశ సువార్త సంఘమా Telugu Christian Songs Lyrics