అపత్కాలమందు యెహెూవా నీకు ఉత్తరమిచ్చును
యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్దరించును
పరిశుద్ధ స్థలమునుండి నీకు సమయము చేయును
సీయోనులో నుండి నిను నిత్యము ఆదుకొనును (2)
నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును
నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును (2)
నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును
తన దక్షిన హస్తబలమే నిను నిత్యము ఆదుకొనును (2)
దురభిమాన పాపమునుండి నిన్ను తప్పించును
దేవునియందు భయమే నిన్ను పవిత్ర పరచును (2)