Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

అన్యజనులేల Christian Song Lyrics

అన్యజనులేల లేచి
గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల
జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల||

భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు
వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల||

ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు
వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల||

పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల||

కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు
నీవు నా కుమారుడవు
నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల||

నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము
దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల||

ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో
కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల||

ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||

అన్యజనులేల Jesus Songs Lyrics in Telugu


అన్యజనులేల Telugu Christian Songs Lyrics