అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
యేసు రాకడకు సమయం అయ్యుందని
సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని
అ.ప: వాయుదా వెయ్యకుండా – కారణాలు చెప్పకుండా
రక్షణ పొందుకోమని
1. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూ
ఆకాశానికెత్తబడి
ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని
2. యేసయ్యను అంగీకరించక త్రోసివేసినవారందరూ
భూమి పై విడువబడి
ఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని