Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Aha Anandhame Maha Santhoshame Yesu Putte ilalo

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||

యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే||

మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే||

తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||


Source from: https://www.youtube.com/watch?v=O2Q8b7EvWzI