Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

aardhya daivama na prana

ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా (2)
నీవేగా నా జీవనాధారము (2)
యెహెూవా యీరే యెహెూవా షమ్మా (2)
నీవేగా నా సమస్తము (2)

మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించుమయ్యా
పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయ్యా (2)
నీ చేతి నీడలో నీ కనుచూపులో నన్ను దాయము నా యేసయ్యా (2)

అరణ్య యాత్రలో మార్గము నీవై నన్ను నడిపించుమయ్యా
మోడుబారిన జీవితాన్ని చిగురింప జేయుమయ్యా (2)
నీ కొరకే నే యిల ఫలియించెద నీ సాక్షిగ నే సాగెదనయ్యా (2)

నా ఎతైన కోటవు నీవే నీవే నా ఆశ్రయమయ్యా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే స్తోత్రమయా
నన్ను విడువని నన్ను మరువని నా కాపరి నీవే నా యేసయ్యా (2)