ఆనంద యాత్ర Telugu Christian Songs Lyrics

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||

యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను(2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును(2) ||ఆనంద యాత్ర||

రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా(2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా(2) ||ఆనంద యాత్ర||

కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను(2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము(2) ||ఆనంద యాత్ర||

ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||

ఆనంద యాత్ర Jesus Songs Lyrics in Telugu


ఆనంద యాత్ర Telugu Christian Songs Lyrics