ఆగని పరుగులో Telugu Christian Songs Lyrics

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2)
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై
కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి
అందించే నీ చేయి – నా స్నేహమై ||ఆగని||

లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా – నా జీవితం ||ఆగని||

ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము ||ఆగని||

ఆగని పరుగులో Jesus Songs Lyrics in Telugu


ఆగని పరుగులో Telugu Christian Songs Lyrics